- Advertisement -
కరోనా పై ప్రజలు ఆందోళన చెందొద్దన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఓవైపు కరోనా బాధితుల స్థితిగతులను తెలుసుకుంటూనే, మరోవైపు బాధితులకు భరోసా కల్పించారు. మరీ సమస్యగా ఉంటే నాకు గానీ నా సిబ్బందికి గానీ ఫోన్ చేయండి. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని అన్నారు.
అలాగే ప్రజాప్రతినిధులు వారిని అందుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని మంత్రి సూచించారు.
- Advertisement -