- Advertisement -
విధి నిర్వహణలో ఐపీఎస్‌లంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. హైదరాబాద్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పెరేడ్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోడీ….తన పదవీకాలంలో ఏదో ఓసారి ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తానని చెప్పారు.
ఒత్తిడిలో పనిచేసేవాళ్లకు యోగా, ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుందని…దీనివల్ల ఎంత పని ఉన్నా ఒత్తిడికి లోనుకారని ప్రధాని తన సందేశంలో తెలిపారు.71 బ్యాచ్‌కు చెందిన 131 మంది యువ ఐపీఎస్‌లకు 42 వారాల పాటు శిక్షణ ఇచ్చారు. వీరిలో 28 మంది మహిళా ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. 131 మందిలో 11 మంది ఐపీఎస్‌లను తెలంగాణకు, అయిదుగురిని ఏపీకి కేటాయించారు.
- Advertisement -