హరికృష్ణ బర్త్ డే…ఎన్టీఆర్ భావోద్వేగం

212
jr ntr
- Advertisement -

నందమూరి హరికృష్ణ 64వ జయంతి సంధర్భంగా హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రిని స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయిన హరికృష్ణ….ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు..మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ప్రస్థానానికి నేతృత్వం మీరు . ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే -నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామారావు” అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.

2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. వెండితెర సీత‌య్య‌గా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో స్థిర‌మైన స్థానం సంపాదించుకున్నారు. శ్రీరాముల‌య్య‌ చిత్రంతోనే. సీత‌య్య‌, టైగ‌ర్ హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్‌, స్వామి, శ్రావ‌ణ‌మాసం చిత్రాల్లో న‌టించి ప్రేక్షకులను మెప్పించారు.

- Advertisement -