డ్రై డేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: హరీష్‌ రావు

273
harish rao
- Advertisement -

ప్రతి ఆదివారం డ్రై డే పాటించి ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు మంత్రి హరీష్ రావు. ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో భాగంగా 20వ వార్డు ముర్షద్ గడ్డలో ఇంటింటా కలియ తిరిగారు. డెంగ్యూ చికున్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు పాటుపడాలన్నారు. ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.

ప్రతి పౌరుడు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు విధిగా పాల్గొనాలన్నారు. మీ ఇంట్లో పరిసరాల్లో నిలిచి ఉన్న నీటి నిల్వలను తొలగించి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలని ప్రజలకు మంత్రి సూచించారు.

- Advertisement -