యువత అప్రమత్తంగా ఉండాలి: గవర్నర్ తమిళి సై

76
Governor Tamilisai

కరోనా విషయంలో యువకులు అప్రమత్తంగా ఉండాలన్నారు గవర్న్ తమిళి సై. 45 ఏండ్లలోపు చాలామంది కరోనా బారిన పడుతున్నారని…ప్రతి ఒక్కరూ ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలు తెలుసుకోవాలన్నారు. 21 నుండి 30 ఏండ్ల లోపు మహిళలు,పురుషుల్లో కేసుల పెరుగుదల స్వల్పంగా ఉందన్నారు.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1,23,090కి చేరింది. ఇందులో 90,988 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,284 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో 818 మంది మృత్యువాతపడ్డారు.