తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటాయి. గత 24 గంటల్లో 2,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 7గురు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,865కు చేరాయి.
ఇక రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 744 మంది మృతిచెందగా 78,735 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. 22,386 యాక్టివ్ కేసులుండగా ఇంట్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో 15,931 మంది ఉన్నారు.
గత 24 గంటల వ్యవధిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 447, రంగారెడ్డి జిల్లాలో 201, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా జనగామా జిల్లాలో 20, జోగుళాంబా గద్వాల జిల్లాలో 59, నల్గొండ జిల్లాల్లో 122, కామారెడ్డి జిల్లాల్లో 61, సిద్దిపేట జిల్లాల్లో 92,రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 52, పెద్దపల్లి జిల్లాల్లో 79, సూర్యాపేట జిల్లాల్లో 63, నిజమాబాద్ 153, మహబూబాబాద్ జిల్లాల్లో 59, మహబూబ్‌నగర్‌జిల్లాలో 49, నారాయణపేట జిల్లాలో 11, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 11 నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో 43,095 మందికి కొవిడ్ -19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 8,91,173 మందికి టెస్టులు చేసినట్లు వైద్య
ఆరోగ్య శాఖ పేర్కొంది.