సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి: ఈటల

251
etela
- Advertisement -

వైద్య ఆరోగ్య శాఖ పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.సీజనల్ వ్యాధులు, డెలివరీలు, పెద్ద ఆసుపత్రుల్లో కరోనా తో పాటు ఇతర ఆరోగ్య సేవలు అందించే అంశంపై చర్చించారు మంత్రి ఈటల.సీజనల్ వ్యాధులు నివారించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నియంత్రణ కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ తో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.త్వరలోనే వైద్య ఆరోగ్యశాఖ- మున్సిపల్ అడ్మినస్ట్రేషన్ తో కలిపి ఒక సమావేశం, వైద్య ఆరోగ్య శాఖ- పంచాయతీ రాజ్-ట్రైబల్ వెల్ఫేర్ తో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం.రేపు అన్ని జిల్లాల వైద్య అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.సీజనల్ వ్యాధులు- నివారణ – చికిత్స కోసం పకడ్బందీ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించిన మంత్రి.

అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల లో ఓపీ సేవలు సమయం పెంచాలని నిర్ణయించారు. 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పెంచాలని ఆదేశం.GHMC పరిధిలో ఈవెనింగ్ క్లినిక్ మొదలు పెట్టాలని నిర్ణయం. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు బస్తీ వాసులకు డాక్టర్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అక్కడే అవసరం అయిన మందులు ఇవ్వాలని. రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించి తెలంగాణ డయజ్ఞాస్టిక్స్ కి అనుసంధానం చేసుకొని ఫలితాలు అందేలా చూడాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు నీ ఆదేశించిన మంత్రి.ట్రైబల్ ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన మంత్రి.
ఈ సీజన్లో వాటర్ బోర్న్, వెక్టర్ బోర్న్ రెండు రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది.నీళ్ళ ద్వారా టైఫాయిడ్, కలరా, హెపటైటిస్, సాధారణ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించి వాటి నుండి బయట పడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాలని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ ద్వారా చాలా వరకు ఇలాంటి జబ్బులు రాకుండా నివారించగలిగామని మంత్రి అన్నారు.వెక్టార్ బోర్న్ ప్రధానంగా దోమల వల్ల ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. దోమలను నివారించ గలిగితే వీరిని అరికట్ట వచ్చు. మలేరియా, డెంగీ, చికన్ గున్యా, వైరల్ జ్వరాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది అని మంత్రి కి వివరించిన అధికారులు.మలేరియా ఆసిఫాబాద్, భద్రాచలం, GHMC పరిధిలో దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది…డెంగీ GHMC, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎక్కువ ఉండనుంది అని అక్కడ తీసుకుంటున్న చర్యల గురించి DH వివరించారు.

సెప్టెంబర్ లో స్వైన్ ఫ్లూ కేసులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకు కూడా కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.నివారణ మీద ప్రధాన దృష్టి పెట్టాలని, అన్ని మందులు, అవసరం అయిన పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు. డెంగీ కోసం అవసరమైన రాపిడ్ కిట్స్ ను అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే కొనసాగించాలని సూచించారు. ప్రతి గ్రామం లో మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని, డాక్టర్స్ ను ఔట్ సోర్సింగ్ పద్దతిలో వెంటనే నియమించుకోవాలని ఆదేశించారు.

అన్ని టీచింగ్ హాస్పిటల్ లు, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రుల్లో కరోనా తో పాటు అన్ని సీజనల్ వ్యాధులు, ఇతర జబ్బులకు బెడ్స్ కేటాయించాలని కోరారు. ఇప్పటి వరకు కొవిడ్ రోగుల కోసం మాత్రమే ఏర్పాటు చేశాము, ఇక మీదట అన్ని ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉంచెల చూడాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి నీ కోరారు. ఫీవర్ ఆసుపత్రి నీ పూర్తిగా సీజనల్ జ్వరాల కోసం సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.

ప్రతి డాక్టర్, సిబ్బంది ఆసుపత్రి దగ్గర్లోనే నివాసం ఉండేలా చూడాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి అదనపు వేతనం ఇచ్చేలా చూడాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో పేషంట్ల రద్దీ కి అనుగుణంగా డాక్టర్స్ సంఖ్య ఉండేలా చూడాలన్నారు. పేషంట్ల రాని దగ్గర డాక్టర్ లు ఉంటే అవసరం ఉన్నదగ్గరికి మార్చాలని సూచించారు.

ప్రసవం కోసం ఏ ఒక్క గర్భిణీ కూడా రాష్ట్రం లో ఇబ్బంది పడకుండా చూడాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ ను మంత్రి ఆదేశించారు.
రాష్ట్రం లో ఉన్న ప్రతి గర్భిణీ డెలివరీ తేదీ ప్రకారం వారికి వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు. డెలివరీ డేట్ కంటే ముందే వారిని ఆసుపత్రి కి తరలించాలని కోరారు. రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

కెసిఆర్ కిట్స్ ప్రవేశపెట్టిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ సంఖ్య పెరిగింది.డయాలసిస్ మొదలు పెట్టిన తరువాత కిడ్నీ పేషంట్ల సంఖ్య పెరిగింది.
ఇదే తరహాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సేవలపై ప్రజలకు భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.13 రకాల స్పెషాలిటీల డాక్టర్స్ జిల్లా, ఏరియా ఆసుపత్రిలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు.బ్లడ్ బ్యాంక్ లో రక్తం కొరత లేకుండా చూడాలని కూడా మంత్రి అధికారులను కోరారు.
వాక్సినేషన్ కార్యక్రమం కూడా షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూడాలని సూచించారు.వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు.జీతాలు పెండింగ్ ఉండవడ్డు, ప్రతి నెల మొదటి వారంలో జీతం అందేలా చూడాలి..భోజనాలు నాణ్యతలో లోపం లేకుండా చూడాలని కూడా ఈ రోజు సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రీజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, DME డా రమేష్ రెడ్డి, DH డా. శ్రీనివాస రావు, TSMIDC ఎండీ చంద్రశేఖర్ రెడ్డి. కరోనా నిపుణుల కమిటీ సభ్యులు డా కరుణాకర్ రెడ్డి, డా. గంగాధర్ పాల్గొన్నారు.

- Advertisement -