- Advertisement -
బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గి రూ.56,240కు చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.51,560కు చేరింది.
బంగారం ధర స్వల్పంగా తగ్గగా వెండి ధర మాత్రం వేలల్లో తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.3000 తగ్గి రూ.68,100గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర తగ్గినట్టు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.
పసిడి ధర ఔన్స్‌కు 1.17 శాతం తగ్గుదలతో 1947 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.88 శాతం తగ్గుదలతో 27 డాలర్లకు చేరింది.
- Advertisement -