రాష్ట్రంలో 98 వేలకు చేరువలో కరోనా కేసులు..

117
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98 వేలకు చేరువయ్యాయి. గత 24గంటల్లో 1,724 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతిచెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 97,424కు చేరగా 729 మంది కరోనా మహమ్మారితో మృతిచెందారు. ప్రస్తుతం 21,509 యాక్టివ్ కేసులుండగా 75,186 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 395 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 105, రంగారెడ్డిలో 169 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు 7.97లక్షల కరోనా టెస్టులు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.