జనవరి 12, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 12వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 353 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 354 రోజులు
*జననాలు*
1863: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు (మ.1902).
1895: యల్లాప్రగడ సుబ్బారావు, ప్రముఖ వైద్య శాస్త్రవేత్త (మ.1948).
1917: మహర్షి మహేశ్ యోగి, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు (మ.2008).
1936: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (మ.2016)
1940: ఎం.వీరప్ప మొయిలీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.
1949: గుండప్ప విశ్వనాథ్, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు.
1962: రిచీ రిచర్డ్‌సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1964: జెఫ్ బెజోస్, అమెజాన్.కాం యొక్క స్థాపకుడు, అధ్యక్షుడు, ప్రధాన కార్యనిర్వాహణా అధికారి మరియు అమెజాన్.కాం పాలక మండలి సభాపతి.
1991: ద్రోణవల్లి హారిక, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.
*మరణాలు*
1989: చెళ్ళపిళ్ళ సత్యం, తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకుడు (జ.1933).
1992: సాంప్రదాయ సంగీత కళాకారుడు కుమార్ గంధర్వ (జ.1924).
2004: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే (జ.1926).
2005: అమ్రీష్ పురి, ప్రముఖ భారత సినిమా నటుడు (జ.1932).
2015: వి.బి.రాజేంద్రప్రసాద్, తెలుగు, తమిళ నిర్మాత, దర్శకుడు (జ.1932).
*పండుగలు మరియు జాతీయ దినాలు*
?జాతీయ యువజన దినోత్సవం