కరోనాపై విజయం సాధిస్తాం: ప్రధాని మోడీ

203
modi
- Advertisement -

భారత తయారీ వస్తువులను ప్రపంచ దేశాలకు ఉత్పత్తి చేయాలన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం మాట్లాడిన ప్రధాని….దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోందన్నారు. మన దేశం కూడా కరోనాతో పోరాడుతోందని వెల్లడించిన మోడీ… దేశ భద్రతను కాపాడుతున్న సైనికులకు వందనం తెలిపారు.

కరోనాపై పోరాటంలో మనం గెలుస్తామని చెప్పారు. దేశంలో చాలా ప్రాంతాలు వరదలతో అల్లాడిపోతున్నాయని తెలిపారు.కరనా వారియర్స్ సేవలు మరువలేనివన్నారు. ఎందరో వీరుల త్యాగఫలంతో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా ముందుకు వెళ్తున్నాని చెప్పారు. ప్రపంచ దేశాలకు భారత్ స్వాతంత్ర్య సంగ్రామం ఒక దీపశఖ అన్నారు. ఆత్మ నిర్బర్ భారత్ అంటే ఏంటో రైతులు చూపించాలన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఎన్నో సాధించామన్నారు. మన శక్తిని ప్రపంచదేశాలకు చాటి చెప్పాలన్నారు.

స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా మొదట రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన మోదీ అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అనంతరం గాఢ్‌ ఆఫ్‌ హానర్‌లో భాగంగా భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మోడీ ప్రసంగించడం ఇది వరుసగా ఏడోసారి.

- Advertisement -