తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవులను, రచయితలను, సాహితీవేత్తలను, వైతాళికులను, సామాజిక దృక్పథంతో పోరాడిన మహనీయులను, చరిత్రకారులను మరియు మహనీయులను గౌరవించుకొంటున్నామన్నారు. అందులో భాగంగా ప్రతిజ్ఞ ప్రార్ధన గీతం రచయిత పైడిమర్రి వెంకటసుబ్బరావుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గౌరవించుకోవాలన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్.
ప్రజలలో ఈర్ష్య, స్వార్ధం లు పెరిగిపోతున్న రోజుల్లో దేశభక్తి పై విద్యార్థి దశ నుండే దేశం పట్ల, దేశభక్తి పట్ల అవగాహన అవరమని గుర్తించి , చైనాతో యుద్ధం ముగిసిన తర్వాత, విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడానికి ఒక గేయం ఉంటే బాగుండునని భావించి “ప్రతిజ్ఞ” రూపకల్పనకు చేశారన్నారు.
నల్లగొండ జిల్లా అన్నెపర్తి గ్రామం నకు చెందిన పైడిమర్రి వెంకటసుబ్బరావు గారు సంస్కృతం, ఉర్దూ, అరబ్బీ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో పండితులుగా పలు రచనలు చెయ్యడం జరిగిందన్నారు.జిల్లా కోశాధికారిగా ఖమ్మం,నిజామాబాదు, నల్లగొండ, నెల్లూరు మరియు విశాఖపట్నంలో జిల్లాలో పనిచేసారన్నారు.
పైడిమర్రి వెంకటసుబ్బరావు గారు రచించిన ప్రార్ధన గీతం ను 1963 నుంచి “ప్రతిజ్ఞ”ను పాఠ్యపుస్తకాలలో ముద్రిస్తున్నారు.కాని ఈ “ప్రతిజ్ఞ” ను రాసిన పైడిమర్రి వారి పేరును మాత్రం ముద్రించలేదు.దాని వల్ల “ప్రతిజ్ఞ” రచయితగా పైడిమర్రి వారి పేరు ఉమ్మడి రాష్ట్రంలో విస్మరింపబడింది. కేంద్ర విద్యాశాఖ సలహా మండలి సూచనను అనుసరించి, కేంద్ర విద్యాశాఖ ఈ “ప్రతిజ్ఞ”ను అనేక భారతీయ భాషలలోనికి అనువదించి పాఠ్యపుస్తకాలలో చేర్చింది.ఆ విధంగా తెలుగు “ప్రతిజ్ఞ”, “భారతీయ ప్రతిజ్ఞ” గా మారిందన్నారు. 26-1-1965 నుంచి వివిధ భారతీయ భాషల విద్యార్థులు”ప్రతిజ్ఞ”ను చదువుతున్నారు.
కాని రచయితగా పైడిమర్రి వారికి మాత్రం ఏ మాత్రం గుర్తింపు రాలేదన్నారు మంత్రి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, పాఠ్యపుస్తకాలలో “ప్రతిజ్ఞ” రచయిత పైడిమర్రి వారు అని ప్రచురించడం మొదలైందన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్.
పైడిమర్రి వారు “ఉషస్సు” (1943) అనే కథా సంపుటిని, “కాలభైరవుడు” (1934) అనే నవలను ప్రచురించారన్నారు. హిందీ నుంచి “గీతామీమాంస” (1938) , దైవభక్తి 1938) , “మీమాంసాత్రయము” (1936) అనే రచనలను అనువాదం చేసారన్నారు. వీరు రాసిన పద్యాలు “గోలకొండ కవుల సంచిక’లో ప్రచురింపబడినట్లు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు వెల్లడించారు.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారితో సంప్రదించి నల్గొండ జిల్లా కు చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించి పైడిమర్రి వెంకటసుబ్బరావు గారిని గౌరవించే ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. పైడిమర్రి వెంకటసుబ్బారావు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు.