పోలీసులకు సెల్యూట్: మాజీ ఎంపీ కవిత

264
corona
- Advertisement -

తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ లో కరోనా కలకలం స‌ృష్టిస్తోంది. పలువురు ఐపీఎస్ అధికారులతో పాటు సీఐలు,ఎస్‌ఐలకు కరోనా సోకగా కొంతమంది కరోనా నుండి కోలుకున్నారు.

తాజాగా కరోనా నుండి కోలుకున్న ఎస్‌ఐ జీవన్‌ను అభినందించారు మాజీ ఎంపీ కవితా. ప్రజాసేవలో మమేకం కావాలని ఆకాంక్షించిన కవిత…కరోనాను జయించిన పోలీసులకు సెల్యూట్ చేశారు.

కరోనా పై పోరాటంలో ముందు వరుసలో ఉండి ఎంతో సాహసోపేతంగా విధులు నిర్వహించారు పోలీసులు. దేశం మొత్తం కరోనాతో ఇంటికే పరిమితమైనా.. పోలీసులు మాత్రం తమ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వహించారు. పోలీసుల సేవలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -