రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ కె.తారక రామారావుగారి విజన్ మేరకు రాష్ట్రంలోని పురపాలక సంస్థలు ‘స్వచ్ఛ తెలంగాణ–ఆరోగ్య తెలంగాణ’ దిశగా మరో ముందు అడుగు వేశాయి.దేశంలోని ఇతర ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా తెలంగాణ రాష్ట్రం పారిశుద్ధ్యం(శానిటేషన్) విషయంలో మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక కార్యాచరణతో, నిర్దిష్టమైన గడువులోగా పనులు పూర్తి అయ్యేలా మున్సిపల్ యంత్రాంగాన్ని సమాయుత్తం చేసి ముందుకు నడిపించారు.
ఫలితంగా రాష్ట్రంలోని 139 మున్సిపాలిటీలు, మున్సిపల్‌కార్పొరేషన్ల పరిధిలోని జనాభా దామాషా పద్దతిలో 70 లక్షల పట్టణ జనాభా అవసరాలకు అనుగుణంగా 7,683 మరుగుదొడ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో గత రెండు నెలల కాలంలోనే 4 వేల మరుగుదొడ్ల నిర్మాణపనులు పూర్తి కావడం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని ఆరు జోన్ల పరిధిలో మంత్రి కేటీఆర్ అదనంగా 3 వేల మరుగుదొడ్ల నిర్మాణాలను లక్ష్యంగా నిర్దేశించగా, జీహెచ్ఎంసీ కమిషనర్ 4,271 మరుగుదొడ్ల నిర్మాణ పనులు లక్ష్యంగా పెట్టకుని నిర్మాణ పనులు పూర్తిచేస్తున్నారు.
మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏడు వేల మరుగుదొడ్లు ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రజల వినియోగంలోకి రానున్నాయి.మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కె.తారక రామారావు గారు ప్రత్యేక శ్రద్దతో మరుగుదొడ్ల నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సంబందిత మున్సిపల్ కమిషనర్లతో స్వయంగా పర్యవేక్షించడ వల్ల పనులు నిర్ణీత కాలంలో వేగవంతంగా పూర్తి అయ్యాయి.
కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్ధవంతంగా అమలుచేస్తూ ప్రజానీకానికి మెరుగైన సేవలు కల్పించాలన్న లక్ష్యంతో శానిటేషన్‌కు మంత్రి కేటీఆర్ గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.ఆగస్టు 15వ తేదీ నుంచి ఆయా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 8 వేల మరుగుదొడ్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చి దిద్దాలనే ముఖ్యమంత్రి గౌరవనీయులు కె.చంద్రశేఖర్‌రావు గారి అడుగుజాడల్లో నడుస్తూ పట్టణాల స్థితిగతుల్లో వినూత్న మార్పులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుడుతున్నారు.