గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

230
mla seethakka
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ గాయని స్మిత ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు గోవిందరావుపేట మండలం గోతుకోయ గ్రామంలో అటవీ ప్రాంతంలో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు ములుగు ఎమ్మెల్యే సీతక్క
.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అడవిబిడ్డల గా మేము అమ్మానాన్నల తర్వాత అత్యంత ఇష్టంగా ప్రేమించేది అడవులని ఈ అడవుల ద్వారా మాకు పండ్లు ఫలాలు ఆహార పదార్థాలు అదేవిధంగా జీవనోపాధి కూడా దొరుకుతుందని అడవి ద్వారా లభించే మూలికల ద్వారానే మేము వైద్యం కూడా చేసుకుంటామని అడవి లేనిదే మాకు జీవితాలు లేవని తెలిపారు.

ఏసీ లలో ఉండడం వల్లనే ఈరోజు వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయని కాబట్టి మనం అందరం ఇంటి ముందు పూల కుండీలను కాకుండా మొక్కలు నాటడానికి ప్రయత్నం చేద్దామని కోరారు. అడవులను కాపాడుకుందాం ప్రాణవాయువును పెంచుకుందాం అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక్కడ చుట్టుపక్కల అంతా అడవి ఉన్నపటికీ గ్రామంలో ఇంటి ముంగట పండ్ల మొక్కలు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జామ మొక్కలు నాటడం జరిగింది అని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -