- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో 47,704 పాజిటివ్ కేసులు నమోదుకాగా 654 మంది మృత్యువాతపడ్డారు.
ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,157కు చేరగా 33,425 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,96,988గా ఉండగా 9,52,744 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో కరోనా రికవరీ రేటు 64.23 శాతంగా ఉండగా 3.4 శాతం మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 1,73,34,885 టెస్టులు చేశామని ఐసీఎంఆర్ వెల్లడించగా నిన్న ఒక్క రోజే 5,28,082 మందికి టెస్టులు చేశామని తెలిపారు.
- Advertisement -