భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్!

255
covid 19
- Advertisement -

కరోనాపై పోరులో భాగంగా వ్యాక్సిన్ కోసం ట్రయల్స్ ముమ్మరంగా సాగుతుండగా ఇందులో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ముందగడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దశల ట్రయల్ రన్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసిన ఆక్స్‌ఫర్డ్ మూడో దశ ట్రయల్స్‌ కోసం సిద్ధమవుతోంది.

ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెన్‌కా టీకా కోసం భార‌త్‌లో అయిదు చోట్ల తుది, మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం మ‌న దేశంలో అయిదు సైట్లు అందుబాటులో ఉన్నాయని….భార‌త్‌లో ఆక్స్‌ఫ‌ర్డ్ టీకాను వాడ‌కంలో తీసుకురావ‌డానికి ముందు ఇక్క‌డే ప‌రీక్షించ‌డం అత్యంత ముఖ్య‌మైన విష‌య‌ం. భార‌త్‌కు చెందిన సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా…..దేశంలో ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేయ‌నుంది.

తొలి రెండు దశల ట్రయల్స్‌ ను యూకేలోని ఐదు ట్రయల్ సైట్లలో చేపట్టారు. ఈ ట్రయల్స్ ఫలితాల్లో సేఫ్టీ ప్రొఫైల్ ఆమోదించదగ్గ విధంగా ఉందని, యాంటీ బాడీ రెస్పాన్స్ పెరిగిందని పేర్కొన్నాయి. ఇక భారత్‌లో నిర్వహించే ట్రయల్స్‌ కరోనా వ్యాక్సిన్‌పై పోరుకు మరింత ముందడుగుపడనుంది.

- Advertisement -