గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్ధానాలకు వైసీపీ అభ్యర్ధులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. రెండు స్ధానాలే ఉండటంతో ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. అయితే ఎవరు ఉహించని విధంగా సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ అభ్యర్ధులను ఎంపిక చేశారు సీఎం జగన్.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పండుల రవీంద్రబాబు, కడప జిల్లాకు చెందిన మైనార్టీ వర్గ నేత జకియా ఖానుంల పేర్లను ప్రభుత్వం గవర్నర్ ప్రతిపాదించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల సమాచారం. వాస్తవానికి చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మరికొంతమంది తమ గాఢ్ ఫాదర్ల ద్వారా గట్టి ప్రయత్నాలు చేశారు.
కానీ జగన్ మాత్రం సామాజిక న్యాయం పాటిస్తూ ఒకటి ఎస్సీ వర్గానికి,మరొకటి మైనార్టీ వర్గానికి కేటాయించినట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ ఎంపీగా ఉన్న పండుల రవీంద్రబాబు.. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీలో చేరారు. కానీ ఎంపీ టికెట్ దక్కలేదు. ఇక కడప జిల్లాకు చెందిన జకియా ఖానుం భర్త పార్టీ కోసం పని చేస్తూ చనిపోయారు.. అందుకే ఆమెకు ఈ పదవి ఇస్తున్నట్టు తెలుస్తోంది.