మాస్క్ ధరించండి ..అదే వీరుడి లక్షణం

220
chiranjeevi
- Advertisement -

కరోనా నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు చిరు. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం అంటూ హీరో కార్తికే‌యతో కలిసి మెగా సందేశం ఇచ్చారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్‌.. అంటూ చిరు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -