మొక్కలునాటిన ఎస్పీ కోటిరెడ్డి….

333
challenge
- Advertisement -

ప్రభుత్వం చేపట్టిన 6వ విడద హరితహారం కి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి గారు క్యాంపు కార్యాలయంలో చెట్లు నాటడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్పీ గారు పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రభుత్వం పెద్ద పీఠం వేస్తుంది , సీఎం కేసీఆర్ దూరదృష్టి , అయన భవిష్యత్ తరాలకు చేస్తున్న ఒక బృహత్తర కార్యక్రమం లో నేను భాగస్వామ్యం కావడం ఎంతో అదృష్టం అన్నారు.

నికి తోడు పర్యావరణ పరిరక్షణ పైన ప్రజలకు మంచి అవగాహనా కల్పిస్తున్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి తమ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు.అంతే కాకుండా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి గారు టౌన్ డిఎస్పీ నరేష్ కుమార్ ,రురల్ సీఐ వెంకట రత్నం,ఎస్.ఐ రమేష్ బాబు లకు ఛాలెంజ్ విసరడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో డీఎస్పీ నరేష్ కుమార్,సీఐ వెంకటరత్నం,ఏ.వి.రావు ,ఎస్.ఐ రమేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -