ప్రతీ వెయ్యిమందికి ఒక టాయిలెట్‌: మంత్రి హరీష్ రావు

176
harishrao
- Advertisement -

నూటికి నూరు శాతం తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలన్నారు మంత్రి హరీష్ రావు.ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై , ఆర్థిక మంత్రి హరీశ్ రావు, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు …ప్రతి మున్సిపాలిటీలో డంప్ యార్డు ఉండాలి. ఆధునిక పద్ధతిలో నిర్వహించాలి.ఉమ్మడి మెదక్ జిల్లాలో రిసోర్స్, పవర్, శానిటైజ్, వాటర్ ఆడిట్ నిర్వహించి గుణాత్మక మార్పుకు నాంది పలుకుతాం అన్నారు.

ప్రతీ వేయి మందికి ఒక టాయిలెట్ ఆగష్టు 15 కల్లా ఉండేలా పని చేస్తాం.డెబ్రిస్ మెనేజ్ మెంట్ ప్రాజెక్టు, యానిమల్ కేర్ సెంటర్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాటు చేస్తాం.మూడు జిల్లాలో జిల్లాకు రెండు చొప్పున మొబైల్ బస్ షీ టాయిలెట్లు ఏర్పాటు చేసి మహిళలకు అందుబాటులో ఉంచుతాం.ఆదాయ వనరులు పెంచుకుని మున్సిపాల్టీలు స్వయంసమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటాం అన్నారు.

వాటర్ ట్యాక్స్ వందకు వంద శాతం వసూలయ్యేలా చర్యలు చేపడతాం.సంగారెడ్డి, సదాశివపేట వంటి మున్సిపాల్టీల్లో నల్లాల ద్వారా నీరు ఇచ్చే ప్రాజెక్టులు త్వరిత గతన పూర్తి చేసి ప్రజల దాహార్తి తీరుస్తాం.పట్టణాల అభివృద్ధి, వాటిల్లో వచ్చే మార్పు నియోజకవర్గాలపైప్రభావం చూపుతుంది.గ్రామల నుంచి వచ్చే ప్రజలు పట్టణాలపై ఆధారపడతారన్నారు.

ఈ కారణం వల్ల పట్టణాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి.హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమీక్షలో ఎంపీ బీబీ పాఠిల్, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, గూడెం మహిపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రామలింగారెడ్డి, వొడిదల సతీష్, పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, వి. భూపాల్ రెడ్డి, కలెక్టర్లు హనుమంతరావు, వెంకట్రామిరెడ్డి, ధర్మారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -