తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రెటరీ శైలేంద్ర కుమార్ జోషి రచించిన ఈకో టి కాలింగ్ (Echo T calling )-టువర్డ్స్ పీపుల్స్ సెంట్రిక్ గవర్నెన్స్ అనే పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈరోజు ఎస్కే జోషి మంత్రి కే తారకరామారావు ని ప్రగతిభవన్లో కలిసి పుస్తక ప్రతులను అందించారు. సుదీర్ఘంగా పనిచేసిన తన అనుభవంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసిన సంవత్సరాలు అద్భుతమైన సమయమనీ ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కి జోషి వివరించారు.
తెలంగాణ పాలన ప్రజల కేంద్రంగా వారి అవసరాల కేంద్రంగా కొనసాగుతూ వస్తున్నద అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ మేరకు సారిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన అనుభవాలను ఈ పుస్తకంలో ఉంచినట్లు మంత్రి కేటీఆర్ కి ఆయన తెలియజేశారు.దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధికారిగా పనిచేసిన ఎస్కే జోషి తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావడం, ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ పుస్తకంలో పేర్కొనడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ పుస్తకం కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తమకు మాత్రమే కాకుండా ప్రభుత్వ లో పనిచేస్తున్న అనేక మంది అధికారులకు కూడా స్పూర్తినిచ్చే లా పని చేస్తుందన్న నమ్మకం తనకు ఉందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించిన ఎస్కే జోషి, ప్రస్తుతం ఈ పుస్తకం ద్వారా భవిష్యత్ తరాలకు తమ పరిపాలనను పుస్తక రూపంలో అందించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తక్కువ కాలంలోనే ఇంత మంచి పుస్తకాన్ని తీసుకువచ్చిన ఎస్ కే జోషీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.