వ్యవసాయాన్ని పండగలా మార్చిన సీఎం కేసీఆర్…

237
jagadish
- Advertisement -

వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామం,నాగరం మండలం వర్దమాను కోట గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్ధాపన చేశారు. అనంతరం నాగరం మండలంలో ఎస్సీ రుణాల చెక్కులను లబ్దిదారులకు అందజేసి వారితో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి…ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి విద్య ను ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 900 పైగా గురుకుల పాఠశాల లను ఏర్పాటు చేశారన్నారు.సబ్భండ వర్గాలు సంతోషంగా, ఆత్మగౌరవంతో జీవించేలా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.ఆసరా , కల్యాణ లక్ష్మీ, షాదీముభారక్ , పథకాలు సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయన్నారు.గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేశారు..వ్యవసాయాన్ని పండుగల మార్చారని తెలిపారు.రైతు బంధు, భీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

ధర నిర్ణయించే అధికారం, హక్కు రైతులకు కల్పించేలా రైతు వేదికల నిర్మాణం చేపట్టామన్నారు. నియంత్రిత సాగుతో రైతులకు లాభం చేకూరుతుందని…..రైతు వేదికల ద్వారా మార్కెటింగ్ అంశాలు, లాభాల సాగు, వ్యవసాయ యాంత్రీకరణ అంశాలపై రైతులు సమగ్రంగా చర్చించుకుని ,అవగాహన పొందే అవకాశం ఉంటుందన్నారు.బడ్జెట్ లో 50 శాతానికి పైగా వ్యవసాయం కోసం ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం…….కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటితో సూర్యాపేట జిల్లా వ్యవసాయ ముఖ చిత్రమే మారిపోయిందన్నారు.బీడు భూములు అన్ని ససస్యశామలం అవుతున్నాయన్నారు.

- Advertisement -