మూడు రోజుల్లో మూసికి కొత్తగేట్లు అమర్చి…చుక్క నీటిని వృదాకానివ్వం అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.రెండు పంటలకు సమృద్ధిగా నీరు అందిస్తామపి…దశాబ్దాలుగా మూసిని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని…నీళ్లు వృధాగా పోతున్న పట్టించుకోలేదన్నారు.
మొన్నటి వరదలకు గేటు తొలిగినా నీళ్లు వృధా కానివ్వలేదని…స్టాఫ్ లాగ్ గేట్ తో నీళ్లు ఆపి రెండు పంటలకు నీళ్లిచ్చామన్నారు.పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని తెలిపారు.
2014 తరువాత రాష్ట్రంలో టి ఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదటనే సాగునీటి ప్రాజెక్ట్ లపై దృష్టి సారించామన్నారు.మూసి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయిన మీదట అప్పటి పాలకులు అటు వైపు చూడక పోవడం వల్లనే మొన్నటి వర్షాలకు గేట్లు పక్కకు తొలిగాయన్నారు.
అయినా ఆఘమేఘాల మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్టాఫ్ లాగ్ గేట్లు అమర్చి నీటి వృధాను అడ్డుకున్నామన్నారు.పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని ఆయన అన్నారు.తాజాగా జరుగుతున్న మరమ్మతులతో మూసి ఆయకట్టు రైతాంగానికి రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లు అందిస్తామన్నారు.