మైగ్రెంట్స్‌ నిరుద్యోగులకు అండగా న్యాక్..

299
minister vemula
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిర్మాణ రంగ వలస కార్మికుల ఉపాధి కల్పన కోసం NAC రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ కు అపూర్వ స్పందన లభిస్తుంది.జూన్ 6న రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి,న్యాక్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించిన ఈ వెబ్సైట్ లో ఇప్పటి వరకు వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న 10 వేల 90 మంది తమ సమాచారాన్ని నమోదు చేసుకున్నారు.

ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే నిర్మాణ రంగం సంస్థలకు మంత్రి వేముల దానికి సంబంధించిన డేటా సి.డి ని ఆవిష్కరించి వారికి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..”కరోనా సృష్టించిన సంక్షోభం నేపథ్యంలో నిర్మాణ రంగంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు (స్కిల్డ్, అన్ స్కిల్డ్ లేబర్) గల్ఫ్ దేశాలు మరియు ముంబాయి, సూరత్ తదితర రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్నారు.

ఇలా స్వరాష్ట్రానికి తిరిగి వచ్చే కార్మికులకు ప్రైవేటు నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలను కల్పించి వారిని అదుకొనేందుకు మరియు నిర్మాణ రంగంలో ఏర్పడబోయే కార్మికుల కొరతను తీర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు NAC (న్యాక్) ద్వారా తెలంగాణ వలస కార్మికుల సంబంధిత సమాచారం సేకరించి వారిని రాష్ట్రంలోని ప్రెవేటు నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది.న్యాక్ దీన్ని ఓ ఛాలెంజ్ తీసుకొని అద్భుతంగా పనిచేస్తుంది.

న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి, వారి టీం కు నా శుభాకాంక్షలు, అభినందనలు.””తెలంగాణ కు చెందిన వివిధ దేశాల నుంచి మరియు మన దేశంలో వివిధ రాష్ట్రాల నంచి స్వరాష్ట్రానికి వచ్చే నిర్మాణ కార్మికులు వారి సమాచారాన్ని https://tsnac.cgg.gov.in సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కలిగిస్తుంది.ఇప్పటి వరకు వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న 10 వేల 90 మంది వలస కార్మికులు తమ వివరాలను NAC వెబ్ సైట్లో నమోదు చేసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర నిర్మాణ రంగ అసోషియన్స్ అయిన BAI, CREDAI, TREDA, TBF, IGBC ద్వారా ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు వారి డేటాను ఇవాళ అందించడం జరిగింది.తద్వార ఆ సంస్థల అవసరాల మేరకు నమోదు
చేసుకున్న కార్మికులకు ఉపాధి అవకాశం కల్పించనున్నారు.

“కోవిడ్-19 వల్ల ఉత్పన్నమైన ఇప్పటి పరిస్థితులు, రాబోయే పరిస్థితులు బేరీజు వేసుకొని ముందుకెళ్లాలి.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో NAC ముఖ్య భూమిక పోషించాలి.నిరుద్యోగ యువతకు,కార్మికులకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలి.ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వివిధ నిర్మాణ రంగ సంస్థలను ఈ కార్యక్రమంలో ఇంకా పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలి.తెలంగాణ లో మానవ వనరుల అవసరం చాలా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ఎవరిని సంప్రదించాలి,ఎక్కడ వెతుక్కోవాలి,ఉద్యోగం ఎలా సంపాదించాలి అనే సరైన అవగాహన లేక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ వెబ్సైట్ వారికి ఓ మార్గం చూపిస్తున్నది.

NAC వెబ్సైట్ లో నా పేరు నమోదు చేసుకుంటే వివిధ సంస్థల వద్ద నా పేరు ఉంటుంది నా అర్హతలకు తగ్గ ఉద్యోగం లభిస్తుంది అనే అవేర్ నెస్ యువతలో పెరుగుతుంది.ఉద్యోగం ఇచ్చే వాళ్లకు,ఉద్యోగం కావాలి అనుకునే వాళ్లకు NAC వారధిగా ఉంటుంది.””ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు భరోసా కల్పించారు. మీరు మా రాష్ట్ర అభివృద్ధి లో భాగస్వాములని వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.దీంతో వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిన వారు కూడా తిరిగి వస్తున్నారు.నిర్మాణ రంగం స్థానిక మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికుల తో మళ్లీ పుంజుకోనుంది.” అని మంత్రి చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ,NAC డిజి భిక్షపతి,BAI, క్రెడాయ్,ట్రెడా,TBF,IGBC నిర్మాణ రంగం ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -