- Advertisement -
తగిన జాగ్రత్తలతో కరోనా మహమ్మారిని అరికడదామని పిలుపునిచ్చారు మంత్రి ఈటల రాజేందర్. వైరస్ భారీన పడకుండా ఉండేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని….ప్రభుత్వం ఎలాంటి పరిస్ధితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు.
రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడం తగ్గించాలని సూచించిన ఈటల..జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారికి దూరం పాటించడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వైరస్ భారిన పడకుండా సురక్షితంగా ఉందామని పేర్కొన్నారు.
స్నేహితులు, సన్నిహితులను కలిసినప్పుడు షేక్ హ్యాండ్‌ను ఇవ్వకుండా నమస్కారం పెట్టాలని.. ముక్కు, కళ్లు, నోటిని చేతులతో పదే పదే ముట్టుకోకుండా ఉండటం మంచిదన్నారు. చేతులను తరచుగా సబ్బు నీటితో గాని, హ్యాండ్ శానిటైజర్‌తో గాని శుభ్రపరుచుకోవడం… జన సమూహంలో తిరుగుతున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు.
- Advertisement -