గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన గువ్వల బాలరాజు

291
guvvala balraju
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపుమేరకు… వారి ఆశయాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లి….. నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తానని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రతినబూనారు.

మంగళవారం తన 44వ పుట్టిన రోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి నీళ్ళు పోశారు. బోకేలు… శాలువలు తీసుకురావోద్దని… వాటి బదులు గువ్వల బాలరాజు మొక్కలను అందజేశారు.నియోజకవర్గంలోని ప్రజలు, మహిళా సంఘాలు, ఉద్యోగులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములై ఆకుపచ్చ అచ్చంపేటగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపును అందుకొని.. స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు విస్తృత ప్రచారం లభించే విధంగా… ఆలోచనతో తన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తూ విజ్ఞప్తి చేస్తున్నట్లు కోరారు.

హరిత తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన తెలంగాణకు హరితహారం ఆరో విడత సీఎం కేసీఆర్ కు కలిసివచ్చిన సంఖ్య ఆరు కావడం…. తన జన్మదినం కూడా కలసి రావడంతో ఈ సారి కరోనా నేపథ్యంలో నూతన ఒరవడిని అమలు చేసే విధంగా ఇంటింటికి ఆరు మొక్కలను పంపిణీ చేయాలని గువ్వల బాలరాజు విజ్ఞప్తి చేశారు.

గువ్వల బాలరాజు పిలుపును అందుకున్న నియోజకవర్గంలోని యువజన సంఘాలు యువకులు పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలు పల్లెలలో స్వచ్ఛందంగా ఇంటింటికి వెళ్లి వివిధ రకాల పండ్ల మొక్కలనుపంపిణీ చేసి స్పూర్తిగా గెలిచారు.ఇదే ఆనవాయితీని కొనసాగిస్తానని గువ్వల బాలరాజు ప్రతినబూనారు.

- Advertisement -