చైనా యాప్స్‌పై నిషేధం…ఇలా చేస్తారు..!

205
modi china
- Advertisement -

చైనా యాప్స్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొరడా ఝుళిపించారు. టిక్ టాక్ సహా 59 చైనా యాప్‌లపై బ్యాన్ విధించారు. నిషేధంతో చైనా టెక్‌ కంపెనీలకు కోట్లలో నష్టం వాటిల్లనుండగా గల్వాన్‌ ఘర్షణకు భారత్‌ ఆర్థిక ప్రతీకారం తీర్చుకుందని పలువురు భావిస్తున్నారు.ఇక టిక్ టాక్‌లో ఏకంగా 15 కోట్లకు పైగా భారతీయ యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు చైనా యాప్‌లను ఎలా బ్యాన్ చేస్తారు అనే సందేహం అందరిలో నెలకొంది.

ఒక దేశంలో యాప్స్‌ను నిషేధించటం ఇలా సాధ్యమవుతుంది. ప్రభుత్వమే నేరుగా బ్యాన్‌ చేయటం. రెండోది మొబైల్‌ యాప్స్‌ను అందించే గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి నిషేధించిన యాప్స్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరటం. ఇందుకోసం ప్రభుత్వాలు చట్టాల ద్వారా కంపెనీలకు ఆదేశాలివ్వాల్సి ఉంటుంది. మూడోది మొబైల్‌ తయారీ కంపెనీలు, టెలికం ప్రొవైడర్లను నిషేధిత యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇవ్వరాదని ఆదేశించటం. ప్రస్తుతం ప్రభుత్వం నిషేధించిన యాప్స్‌లో చాలావరకు థర్డ్‌పార్టీ యాప్‌లే.

యూజర్ల సమాచారాన్ని ఈ యాప్స్‌ దుర్వినియోగం చేయడమే కాదు పాస్‌వర్డులు సహా ప్రతి డాటా చైనాకు చేరవేత చేస్తున్నాయని నిఘావర్గాలు తేల్చటంతో నిషేధం విధించినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సాంకేతిక సమాచార శాఖ తెలిపింది.

- Advertisement -