తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ జయంతి..

247
Telangana Jagruthi Cell Bahrain
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్,మంత్రి కేటీర్, మాజీ ఎంపీ కవితల పిలుపు మేరకు తెలంగాణ జాగృతి బహ్రెయిన్ ఆధ్వర్యంలో బాబూరావు అధ్యక్షతన జాగృతి సభ్యులు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు రావు జయంతి సందర్భంగా సంవత్సరకాలం పాటు శతజయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా అధ్యక్షుడు బాబూరావు మాట్లాడుతూ.. బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, సాహితీవేత్త అయిన పీవీ నరసింహారావు సేవలను స్తుతించడం, మరియు సంవత్సర కాలం పాటు జయంతి ఉత్సవాల కార్యాచరణకు నాంది పలకడం జరిగింది.ఈ కార్యక్రమంలో జాగృతి బహ్రెయిన్ సభ్యులు విజయ వర్ధన్, శ్రీనివాస్, ప్రభాకర్, రవీందర్, అరుణ్, అనిల్, నజీర్ మరియు ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ బహ్రెయిన్ సభ్యులు బొలిశెట్టి వెంకటేష్, రాజేందర్ చెన్నమనేని, లింబాద్రి, శ్రీకాంత్, రాజేష్ ప్రేము పాల్గొన్నారు.

- Advertisement -