ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి ఉత్తర మధ్యమహారాష్ట్ర వరకు 3.1 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.తూర్పు- పశ్చిమ shear zone Lat.15.0 deg.N వెంబడి 5.8 km ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలోని సంగారెడ్డి , మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ , నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల మరియు నాగర్ కర్నూల్ జిల్లాలలో కొన్నిచోట్ల ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.