22వ రోజు ఆగని పెట్రో మంట…

243
petrol price today
- Advertisement -

వాహన వినియోగదారులకు చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశీ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 22వ రోజు పెట్రోల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆదివారం లీటర్ పెట్రోల్ పై 22 పైసలు పెరగగా డీజీల్ పై 17 పైసలు పెరిగింది.

హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 26 పైసలు పెరగగా లీటర్ పెట్రోల్ ధర 83.44గా ఉంది. డీజిల్ పై 21 పైసలు పెరిగి లీటర్ ధర 78.57గా ఉంది.చెన్నైలో పెట్రోల్ ధర 83.59, డీజిల్ ధర 77.61గా ఉండగా దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ 80.30,డీజిల్ ధర 80.40గా ఉంది.

లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత జూన్‌ 7 నుంచి దేశంలో పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జూన్‌ 1న లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.71.26గా ఉండగా, ప్రస్తుతం అది రూ.83.44కి చేరింది.

- Advertisement -