- Advertisement -
పుదుచ్చేరి లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా కరోనా కారణంగా ఏకంగా సీఎం కార్యాలయాన్నే మూసివేశారు.
పుదుచ్చేరిలోని శాసనసభ సీఎం కార్యాలయంలో పనిచేసే మల్లీ టాస్కింగ్ స్టాప్ సభ్యుడికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో శానిటైజ్ చేసిన అనంతరం కార్యాలయాన్ని ఈ ఉదయం మూసివేశారు.
అసెంబ్లీ భవనం మొత్తాన్ని శానిటైజ్ చేయనున్నట్లు…కరోనా బాధితుడితో సన్నిహితంగా మెలిగిన ఐదుగురు వ్యక్తులను హోం క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అత్యవసర పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన సీఎం వి.నారాయణస్వామి విషయం తెలిసిన అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు.
- Advertisement -