కోహెడలో అక్రమమట్టి తవ్వకాలను అడ్డుకున్న స్ధానికులు

136
sand mafia

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కోహెడ రెవెన్యూ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు స్ధానిక కౌన్సిలర్లు, ప్రజలు. ఈసందర్భంగా అక్రమ త్రవ్వకాలు జరుపుతున్న వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. అబ్దుల్లాపూర్ మెట్టు మరియు హాయత్ నగర్ మండలంలో మట్టి తవ్వకాలకి మైనింగ్ డిపార్ట్మెంట్ బ్యాన్ ఉండటం తో కోహెడ రెవెన్యూ కి అనుకుని ఉన్న రాందాస్ పల్లి రెవెన్యు లో పెర్మిషన్ తీసుకుని అక్రమంగా కోహెడలో తవ్వకాలు జరిపి మట్టిని అమ్ముకోవడం జరుగుతుందని అన్నారు.

సుమారు ఇక్కడ 20 టిప్పర్ లారీల మట్టి లోడ్ తో వెళ్తుండగా స్ధానికులు అడ్డుకుని రెవెన్యూ శాఖ అధికారులకి ఫిర్యాదు చేశారు. దీంతో స్ధానిక విఆర్వో వచ్చి ఘటన స్ధలాన్ని పరిశీలించి పై అధికారులకు రిపోర్ట్ చేస్తానని తెలిపారు. అయితే సంబంధిత మైనింగ్ అధికారులు మాత్రం ఫిర్యాదు చేసిన కూడా స్పందించకపోవడం తో స్థానిక కౌన్సిలర్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పంట పొలాలకు సైతం నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు . ఇకనైనా అధికారులు స్పందించి ఈ మైనింగ్ మాఫియా ఆగడాలని అరికట్టాలని కోరారు.