- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటిన హీరో అడవి శేషు. ఈ సందర్భంగా అడవి శేషు మాట్లాడుతు పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మొక్కలు నాటాలని.. వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా 1) హీరోయిన్ శోభిత ధూళిపాళ 2) డైరెక్టర్ శశికిరణ్ లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
- Advertisement -