6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా చొప్పదండి మండల కేంద్రం కలెక్టర్ శెశాంకతో కలిసి మొక్కలు నాటారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవింధర్ రెడ్డి. మున్సిపల్ చైర్మన్ గుర్రం భూంరెడ్డి నీరజ.మున్సిపల్ కమిషనర్ నయిమ్ షా ఖాద్రీ. నాయకులు మహిళలు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ…ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి హరిత తెలంగాణగా తీర్చిదిద్ది సీఎం కేసీఆర్ కు అంకితం చేయాలని కోరారు. దేశంలో ఎక్కడ లేని విధంగా స్వేచ్ఛ వాయువులను అందించేందుకు సీఎం కేసీఆర్ హారితహారం కార్యక్రమాన్ని తీసుకుని దేశంలో నే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
దేశ రాజధాని డిల్లీలో అడవులు లేకపోవడంతో కాలుష్యం తో అల్లాడిపోతున్నారని అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలన్నారు. ఇది కేవలం ప్రభుత్వం అధికారులు చేసే పనిగా భావించకుండా అందరూ బాధ్యత గా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని. అలాగే ప్రతి ఇంటికి పళ్ళమొక్కలను పూల మొక్కలను అందివ్వనున్నట్లు తెలిపారు కలెక్టర్ శెశాంక.