సానుకూల వాతావరణంలో భారత్- చైనా చర్చలు…

290
india china news
- Advertisement -

భారత్, చైనా మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని వెల్లడించింది ఆర్మీ.మోల్డోలో నిన్న సుమారు 10 గంటల పాటు చర్చలు జరిగాయని…సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపింది భారత ఆర్మీ.

ఉద్రిక్త పరిస్థితుల నుంచి సాధారణ పరిస్థితి తీసుకువచ్చేందుకు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది ఆర్మీ.ఉద్రిక్త ఉన్న ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లేందుకు ఇరువురు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించారు.

తూర్పు లడఖ్‌లోని అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు వెనక్కి వెళ్లే కార్యాచరణపై చర్చ జరిగిందని….అనుకున్న పద్ధతులను ఇరువురు తప్పకుండా పాటించేలా సమన్యాయం పాటించాలని నిర్ణయం తీసుకున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు.

- Advertisement -