- Advertisement -
ప్రపంచదేశాలను కరోనా వైరస్ గజగజలాడిస్తుండగా ఈ మహమ్మారికి ఎప్పుడు విరుగుడు వస్తుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్న వారికి నిజంగానే ఇది గుడ్ న్యూస్. ఇప్పటికే ముంబైకి చెందిన గ్లెన్ మార్క్ ట్యాబ్లెట్ కనిపెట్టగా హైదరాబాద్‌కు చెందిన హెటిరో ఫార్మా ..కరోనాకు అతి తక్కువ ధరలో ఇంజక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇక తాజాగా కరోనాకు వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచదేశాలు నిమగ్నంకాగా నైజిరియా సక్సెస్ సాధించింది.ఆఫ్రికాలో ఆఫ్రికన్ల కోసం కరోనా వ్యాక్సిన్ ను డెవలప్ చేసినట్టు అడిలెక్ యూనివర్శిటీలో మెడికల్ వైరాలజీ, ఇమ్మునాలిటీ, బయో ఇన్ఫర్మేటిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఒలడిపో తెలిపారు.
ఇంకా కొన్ని ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని, దీనికి సంబంధించిన సూది మందు తయారు కావడానికి కనీసం 18 నెలల సమయం పడుతుందని ఒలడిపో వెల్లడించారు.
- Advertisement -