తెలంగాణలో రోజురోజుకి కరోనా రోగుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24గంటల్లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 499కేసులు నమోదయినట్లుప్రకటించారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 329, రంగారెడ్డి జిల్లాల్లో 129 రికార్డయ్యాయి. జనగామ 7, మహబూబ్‌నగర్ 6, మేడ్చల్, మంచిర్యాల, వరంగల్ అర్బన్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో 4 చొప్పున, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 2 చొప్పున, సంగారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో 1 చొప్పున నమోదయ్యాయి.
వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఇప్పటివరకు కరోనా 198మంది మృతి చెందారు. నిన్నటి వరకు 6526కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3352మంది డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం ఒక్కరోజే 2,477 టెస్టులు చేయగా, 499 పాజిటివ్ రాగా, 1,978 నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు వైద్యశాఖ అధికారులు.