సినీ నిర్మాత బండ్ల గ‌ణేశ్ కు క‌రోనా పాజిటివ్

232
Bandla_Ganesh_coronavirus
- Advertisement -

దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తోంది. ఎన్ని జాగ్ర‌త్త‌‌లు తీసుకున్న కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. సామాన్యులు సెలెబ్రిటీలు అన్న తేడా లేకుండా అందరినీ కబళించి వేస్తుంది.సినీ నిర్మాత బండ్ల గ‌ణేశ్ కు క‌రోనా వైర‌స్ సోకింది. గ‌త రెండు రోజులుగా ఆయ‌న జ్వ‌రంతో ఇబ్బందిప‌డుతుండ‌టంతో ‌ఆసుప‌త్రికి వెళ్లి చెక‌ప్ చేయించుకున్నారు. అనంత‌రం క‌రోనా టెస్ట్ చేయ‌గా అత‌నికి పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది.

దీంతో బండ్ల గ‌ణేశ్ ఓ ప్రైవేటు ఆసుప‌త్రితో చికిత్స తీసుకుంటున్నారు. ఆశ్చ‌ర్యం ఏంటి అంటే గ‌త కొద్ది రోజుల నుంచి బండ్ల ఇంటి నుంచి బ‌య‌ట‌కు కూడా రాలేదు..అయినా ఆయ‌న క‌రోనా భారిన ప‌డ‌టంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా గ‌డిచిన 24గంట‌ల్లో తెలంగాణ‌లో రికార్డు స్ధాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.ఒక్క గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోనే 329 కేసులు నమోదవ్వగా, రంగారెడ్డిలో 129, మేడ్చల్, మంచిర్యాల, నల్గొండలో నాలుగేసి చొప్పున, మహబూబ్‌నగర్ 6, జనగామ 7 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -