సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి హరీష్ రావు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉన్న 3 నేషనల్ హైవేలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు… మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్‌హెచ్ 161 పనులు వేగవతం చేయాలని అధికారులకు సూచించామని.. సంగారెడ్డి జిల్లాలోని 1447 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను 2 నెలలో పూర్తి చేసి ప్రజలకు అందించాలి అని మంత్రి అన్నారు.
నియంత్రిత సాగు వ్యవసాయానికి సహకరించిన రైతులకు ధన్యవాదాలు. జిల్లాలో 116 రైతు వేదికలకు స్థలం కేటాయింపు జరిగింది. 3 నెలలో వీటిని పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. కరోన లాంటి మహమ్మారి ఉన్నప్పటికి కూడా రైతులకు ఇబ్బందులు కల్గనివ్వలేదు. 23 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఇప్పటికే రైతులకు అందజేసాం. అన్ని విషయాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. కరోనా నేపథ్యంలో ప్రజలు అందరు స్వీయ నియంత్రణ పాటించాలి అని మంత్రి హరీష్ తెలిపారు.