- Advertisement -
దేశంలో వరుసగా 12వ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిన పెట్రోల్ ధరలు పెరుగుతుండటం సామాన్యుడికి భారంగా మారింది. హైదరాబాద్‌లో గురువారం లీటరు పెట్రోల్ ధర 55 పైసలు పెరుగుదలతో రూ.80.77కు, డీజిల్ ధర 63 పైసలు పెరుగుదలతో రూ.74.70కు చేరింది.
దీంతో గడిచిన 12 రోజుల్లో పెట్రోల్‌పై రూ.6.55, డీజిల్‌పై రూ.7.04 పెరగగా ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.77.81, డీజిల్ ధర రూ.76.43కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 1.16 శాతం తగ్గుదలతో 40.07 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2.19 శాతం క్షీణతతో 37.16 డాలర్లకు తగ్గింది.
- Advertisement -