- Advertisement -
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్ ఆర్‌ఎన్ కోపర్ మున్సిపల్ జనలర్ హాస్పిటల్‌లో సుశాంత్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు.
సుశాంత్ ఆత్మహత్య పై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో పోస్ట్‌మార్టం నివేదిక కీలకం కానుంది. సుశాంత్ స్నేహితులు ఇచ్చిన సమాచారంతో ఆయన ఫ్లాట్‌కు చేరుకున్న పోలీసులు గదిలో అన్ని ఆధారాలను సేకరించారు.
కొన్ని మందులు మాత్రమే దొరికాయని, సూసైడ్ నోట్ లాంటివేమీ లేవని తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. సుశాంత్ మృతికి గల కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు.ఇక పోస్టుమార్టమ్ అనంతరం ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి.
- Advertisement -