హ్యాపీ బర్త్ డే ఆచార్య కొరటాల శివ

452
koratala siva
- Advertisement -

మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,భరత్ అనే నేను వంటి సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో అగ్రహీరోల అటెన్షన్ తన వైపు తిప్పకున్న కొరటాల సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఇక ఇవాళ ఆయన బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

బ్రహ్మోత్సవం ఫ్లాప్‌తో నిరాశలో ఉన్న ప్రిన్స్‌ మహేష్‌కు భరత్ అనే నేను సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. వరుసగా నాలుగు సినిమాలు వందకోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడంతో కొరటాల టాప్ దర్శకుడిగా మారిపోయారు.

భరత్‌ అను నేను తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నాడు కొరటాల. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ఖరారు కాగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

వరుసగా నాలుగు హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన కొరటాల..మరెన్నో హిట్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఇలానే అలరించాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

- Advertisement -