తెలంగాణకు వర్ష సూచన..

203
telangana rains
- Advertisement -

మధ్యమహారాష్ట్రలో మరికొన్ని ప్రాంతాలు, మరఠ్వాడ మరియు విదర్భ లోని చాలా ప్రాంతాలు, చత్తీస్ గఢ్ లో మరికొన్ని ప్రాంతాలు, ఒరిస్సా మరియు పశ్చిమబెంగాల్ లో మిగిలిన ప్రాంతాలు, ఝార్ఖండ్ లో చాలా ప్రాంతాలు, బీహార్ లో కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయి.

మధ్య అరేబియా సముద్రంలో మిగిలిన ప్రాంతాలు, ఉత్తర అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతాలు(ముంబైతో సహా), చత్తీస్ గఢ్ లో మరికొన్ని ప్రాంతాలు, ఝార్ఖండ్, బీహార్, దక్షిణ గుజరాత్ లో కొన్ని ప్రాంతాలు, దక్షిణ మధ్యప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు రాగల 24 గంటలలో విస్తరించే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు దానిని ఆనుకొని ఉన్న కోస్తా ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు బలహీనపడింది. దీనికి అనుబంధముగా ఉత్తర ఇంటీరియర్ ఒరిస్సా మరియు దాని పరిసర ప్రాంతాలలో 7.6 km ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

భారతదేశం మీదుగా 5.8 km ఎత్తు వరకు కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు కొన్ని చోట్ల మరియు ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు.

- Advertisement -