షూటింగ్స్ పునఃప్రారంభం..

226
ramoji filmcity
- Advertisement -

రెండున్నర నెలల తర్వాత సినిమా షూటింగ్స్ పున:ప్రారంభమయ్యాయి. లాక్ డౌన్ కారణంగా ఇప్పటివరకు ఇంటికే పరిమితమైన నటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ సందడి మొదలైంది. ప్రస్తుతం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్ చిత్రీకరణ ప్రారంభంకాగా పరిమిత సిబ్బందితో.. ప్రభుత్వం ఇచ్చిన అన్ని సూచనలూ పాటిస్తూ చిత్రీకరణ చేశారు.

చిత్రీకరణ జరిపే లొకేషన్ బయట, లోపల పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. సెట్‌లోకి వచ్చే సిబ్బంది, నటీనటులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతల నమోదుతో పాటు తప్పనిసరిగా శానిటైజర్ రాసుకుంటూ, మాస్క్‌లు ధరిస్తున్నారు.షూటింగ్‌కు ఉపయోగించే కెమెరాలు, ఇతరత్రా వస్తువులు కూడా శానిటైజ్ చేస్తున్నారు.

- Advertisement -