బాలయ్య సాంగ్‌..స్వర్గంలో ఎన్టీఆర్‌ డ్యాన్స్‌:వర్మ పంచ్

412
rgv
- Advertisement -

తన 60వ పుట్టినరోజు సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ స్పెషల్ సాంగ్‌ పాడిన సంగతి తెలిసిందే. బాలయ్య పాడిన పాటపై తనదైన శైలీలో పంచ్ విసిరారు దర్శకుడు ఆర్జీవీ. శివశంకరి అంటూ బాలయ్య పాడిన పాటను షేర్ చేసిన వర్మ…వావ్..మహ్మద్ రఫీ, ఎస్పీ బాలసుబ్రమణ్యం నేపథ్య గానంలో జూనియర్ ఆర్టిస్ట్ లలా అనిపిస్తున్నారు. బాలయ్య పాట వింటుంటే శ్రోతల హార్ట్ బీట్ పెరిగిపోతోందని సెటైర్ వేశారు.

శంకర శాస్త్రీ కలిపినట్టుగా మోజర్ట్ మ్యూజికల్ లాండ్ స్కేప్ ఇచ్చినట్టుగా ఉంది ట్వీట్ చేశారు ఆర్జీవీ. కొంతమంది చెడ్డవారు నేను జోక్ చేస్తున్నా అంటున్నారు కానీ దేవుడిమీద,బాలయ్య మీద ఒట్టు నేను మ్యూజిక్ అనే ప్రపంచానికి పరిచయం అయిన దగ్గరి నుంచి ఇది గ్రేట్ సాంగ్,ఈ పాట విని ఎన్టీఆర్ స్వర్గంలో డ్యాన్స్ చేస్తుంటాడు అని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు వర్మ.

- Advertisement -