- Advertisement -
కేరళలో గర్భిణి ఏనుగుని చంపిన ఘటన యావత్ భారత దేశాని కుదిపేసింది. మనిషి ఇంత అరాచకాని దిజగారుతాడా అనే ఆలోచలు అందరిలో కలిగించింది. లాక్ డౌన్ సమయంలో ఆహారం లేక అలమటిస్తున్న మూగ జీవాలకు తన సొంత గ్యారేజ్‌లో ఆహారం వండి నగర వ్యాప్తంగా పంపిణీ చేసే వారు ఒక వైపు ఉండగా,మరోవైపు ఆహారంలో పేలుడు పదార్ధాలు పెట్టి జంతువులకు తినిపించే మానవ మృగాలు కూడా ఇదే సమాజంలో ఉన్నారు. కేరళలో ఏనుగుని చంపిన ఘటనపై నెరేడ్మెట్‌లో నివసించే శ్రీనివాస్ అనే వ్యక్తి స్పందిస్తూ.. ఏనుగుని హతమార్చిన వారి ఆచూకి తెలిపిన వారికి తనవంతుగా రెండు లక్షలు నగదు అందజేస్తామని ప్రకటించారు.
- Advertisement -