ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఏపీకి తొలి మహిళా సీఎస్‌గా వచ్చిన నీలం సాహ్ని ఈ జూన్ 30 వరకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీకి లేఖ రాయడంతో మరో మూడు నెలల పాటు సీఎస్‌గా ఈమె పదవి కాలాన్ని పొడగించారు.
ఈమె 1984వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఉమ్మడి ఏపీలో మచిలీపట్నం ,టెక్కలిలో అసిస్టెంట్ కలెక్టర్‌గా,నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా,కలెక్టర్‌గా పనిచేశారు. కేంద్ర సామాజిక న్యాయ, ఎంపవర్ మెంట్ కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్ని ఏపీకి తొలిమహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్, టీఆర్ ఆండ్బీ కార్యదర్శి, క్రీడల శాఖ కమిషనర్,సాప్ వీసీ, ఎండీ వంటి హోదాల్లో ఆమె పని చేశారు. మున్సిపల్ శాఖ డిప్యూటీ సెక్రటరీగా,హైదరాబాద్‌లో స్త్రీ,శిశు సంక్షేమశాఖ పీడీగా విధులు నిర్వర్తించారు. నిజామా బాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పలు హోదాల్లో పనిచేశారు.