పల్లె ప్రగతితో గాంధీ కలలు సాకారం: హరీష్ రావు

228
harish rao
- Advertisement -

గాంధీజీ కలలు కన్న గ్రామీణ భారతాన్ని ఈ రోజు పల్లె ప్రగతి ద్వారా సాధించాం అన్నారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తమ్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, జడ్పి చైర్ పర్సన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిపి జోయల్ డేవిస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు… రాష్ట్రం సాధించుకున్న ఫలాలు ఈ రోజు సిద్దిపేటకు అందాయన్నారు. గోదావరి జలాలు సిద్దిపేటకు అందుతాయని చెప్పాం.. ఈ రోజు సాదించుకున్నాం అన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ ఫలాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయన్నారు.

సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష తో కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ సాధించారన్నారు. అమరుల ఆశయాల కు అనుగుణంగా తెలంగాణ పురోగమిస్తుందని… ఈ రోజు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. దేశంలో ఎవరు ఏ పథకాన్ని చేపట్టాలన్నా తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు.

కరోనా లాంటి విపత్తులు వచ్చినా అభివృద్ధిని కొనసాగిస్తూ, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం అన్నారు. ఉద్యమ సందర్భంలో ఏ విధంగా కృషి చేశామో అదే విదంగా రాష్ట్ర అభివృద్ధిలోనూ పని చేస్తున్నాం అన్నారు. ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వసుతులకు అన్ని విధాలా అండగా ఉంటాం అన్నారు. ఇదే అంకిత భావంతో రాబోయే రోజుల్లోనూ పని చేస్తూ బంగారు తెలంగాణకు కృషి చేస్తాం అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా..ఆయన అడుగుజాడల్లో రాష్ట్రాన్ని ,సిద్ధిపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం అన్నారు.

- Advertisement -