తెలంగాణకు మణిహారంగా కాళేశ్వరం: తలసాని

60
talasani srinivasyadav

కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ కు మణిహారం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో 6వ తెలంగాణ రాష్ట్ర అవిర్భవా దినోత్సవ వేడుకలలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు మంత్రి తలసాని.

ముఖ్యమంత్రి తెలంగాణ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పం తో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్రతకలేరని చెప్పిన వారికి ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చూసి నిబ్బురపోతున్నారన్నారు.

కరోనా వ్యాధి ప్రభావం ఉన్న కూడా రైతులు నష్టపోకూడని పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైతులకు నీటి ఎద్దడి లేకుండా ఉంటారని, సాగు, తాగు నీటి కి సరిపడా ఉంటాయన్నారు.

సబ్సిడీ ద్వారా చేప పిల్లలను ఇచ్చి మత్స్య కార్మికులను, 75% సబ్సిడీ ఇచ్చి గొర్రెల కపరులను అదుకుంటున్నామన్నారు. తెలంగాణ సాంస్కృతిక పండుగలను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఘనంగా జరుపుకుంటున్నాం అన్నారు. చరిత్ర ఉన్నత వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చీరస్థాయిలో నిలిచిపోతుందన్నారు తలసాని.